- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గ్యాస్ కొరతపై ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఎల్‌పీజీ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత స్టాక్ ఉందని, రోజుకు లక్ష సిలిండర్ల విక్రయం జరుగుతోందని తెలిపింది. LPG సరఫరా స్థిరపడడంతో పాటు, వాణిజ్య గ్యాస్ సరఫరా కూడా 70% వరకు పునరుద్ధరించామని పేర్కొంది. అలాగే ప్రజలను PNG వైపు మళ్లించేందుకు దేశవ్యాప్తంగా 2400కుపైగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది. పరిశ్రమలకు 80%, ఎరువుల రంగానికి 95% గ్యాస్ సరఫరా పునరుద్ధరించడంతో వినియోగదారులకు ఊరట లభించింది.
- Advertisement -



