Saturday, April 11, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రేమోన్మాది వెంకటేశ్‌పై కాల్పులు

ప్రేమోన్మాది వెంకటేశ్‌పై కాల్పులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట ఇంటర్ విద్యార్థిని రామకీర్తన (17)ను చంపిన ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి తీసుకెళ్తుండగా బాసాపురం చెక్‌పోస్ట్ సమీపంలో నిందితుడు వెంకటేశ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలికి గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, పెళ్లికి నిరాకరించడంతో నిన్న వెంకటేశ్ కత్తితో రామకీర్తన గొంతుకోసి కర్కశంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -