Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని మీరా భయందర్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇంద్రలోక్ ఫేజ్ 4లోని మురికివాడల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -