Saturday, April 11, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం: రెండ్రోజుల్లో కొడుకు పెళ్లి..రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

విషాదం: రెండ్రోజుల్లో కొడుకు పెళ్లి..రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షేట్‌పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గయ్య అనే వ్యక్తి కుమారుడి వివాహం మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల్లో భాగంగా సరుకుల కోసం బయటకు వెళ్లిన ఆయన అయ్యపల్లి సమీపంలో లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఇప్పుడు ఏడుపు కేకలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -