నవతెలంగాణ-హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రగల్బాలు పలికిన ఎన్డేయే కూటమి..విద్యా వ్యవస్థను నీరుగార్చుతుంది. ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేయడంతో పలు ప్రయివేటు విద్యా సంస్థలు ప్రేటేగి పోతున్నాయి. అందుకు నిదర్శనమే బీహార్ సివాల్ జిల్లాలోని ఓ ప్రయివేటు విద్యా సంస్థ విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించింది. పరీక్షల సమయంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు రోడ్డలపై నిలబడి పరీక్షలు రాస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతి ఏటా లక్షలల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం పరీక్షల సమయంలో విద్యార్థులు కూర్చొవడానికి కుర్చీలు లేకపోవడం అన్యాయమని, ఈ తరహా ప్రయివేటు విద్యాసంస్థలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బీహార్లో రోడ్లలపై నిలబడి పరీక్షలు రాసిన విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



