- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, తుల ఉమ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 20న మోతెలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతుందని తెలిపారు. లక్షకు పైగా జనాభాకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
- Advertisement -



