Saturday, April 11, 2026
E-PAPER
Homeజిల్లాలుS.R.శంక‌ర‌న్ ఐఏఎస్ అకాడ‌మీలో ఘ‌నంగా పూలే జ‌యంతి

S.R.శంక‌ర‌న్ ఐఏఎస్ అకాడ‌మీలో ఘ‌నంగా పూలే జ‌యంతి

- Advertisement -
  • ప్రధాన వక్తగా మాజీ ఐఓఎఫ్ఎస్ అధికారి, Y.సత్యనారాయణ
    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని S.R.శంక‌ర‌న్ (IAS ACADEMY) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 200వ‌ జయంతి ఘ‌నంగా జ‌రిగింది. పూలే, అంబేద్క‌ర్,బాబు జగ్జీవన్ రామ్ చిత్ర‌ప‌టాల‌కు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. అకాడమీ ప్రిన్సిపల్ కె.సురేందర్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జ‌ర‌గ‌గా ప్రధాన వక్తగా మాజీ ఐఓఎఫ్ఎస్ అధికారి, Y.సత్యనారాయణ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి, వారి త్యాగాల బాటలో నడవాలని సూచించారు. మ‌హానీయుల‌ను ఓ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తులుగా చిత్రిక‌రించే ప్ర‌య‌త్నం నేడు స‌మాజాంలో జ‌రుగుతోంద‌ని, పూలే, అంబేద్క‌ర్,బాబు జగ్జీవన్ రామ్‌లు గౌతమ బుద్ధుడు సూచించిన మార్గంలోనే నడిచారని, ప్రపంచ మానవాళికి దోపిడీ, పీడన లేని సమాజం కోసం పోరాడారని, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రతృత్వం, కోసం కొట్లాడారని, అలాంటి విశ్వ మానవులైనటువంటి వ్యక్తులను పరిమితంగా ఒక కులానికి చేసి చూడడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నేటి విద్యార్థులు వారి జీవిత చరిత్రలను అధ్యయనం చేసి త్యాగనిరతని, సేవా తత్ఫ‌రతిని పెంపొందించుకోవాలని, సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మొదటగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అలంకరణ చేసిన తర్వాత భారత రాజ్యాంగ పీఠికతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.సతీష్ కుమార్, మ‌హాత్మా జ్యోతిరావు పూలే స్మృతి స‌మితి అధ్య‌క్షులు ముదిగొండ స‌తీష్‌, స‌హాయ‌క కార్య‌ద‌ర్శి ప‌రువ‌య్యా, కార్యాలయ సిబ్బంది రమా గాజర్ల, బి.రంజిత్ కుమార్, కౌటం రాజేష్, నివేష్, ఆన్‌లైన్ కోర్సు ఎడిటర్ కోట మురళీకృష్ణ, విద్యార్థినీ విద్యార్థులు సరియం భార్గవి, బి.అఖిల,కె.లత,గౌతమి, బిజ్జా రాజేందర్, రాంగోపాల్ కంపెనీ, శ్రావణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -