- Advertisement -
నవతెలంగాణ-మోర్తాడ్: మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామ శివారులోని సంతోష్ నగర్ కాలనీ సమీపంలో గుడ్స్ రైల్ ఢీకొని దండగుల లక్ష్మవ్వ(81) మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ హనుమా గౌడ్ తెలిపారు. వృద్ధురాలు మతిస్థిమితం సరిగా లేక రైల్వే పట్టాలపై వెళ్తుండగా గూడ్స్ రైడ్ ఢీకొని ఉండవచ్చని తెలిపారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉండగా ఐదుగురు మృతి చెందగా ఇద్దరు ఉన్నారు. ఆ వృద్ధురాలని పట్టించుకోకపోవడంతో మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రైల్వే పట్టాలపై నడుస్తూ ఉండగా గూడ్స్ రాయల్ ఢీకొని ఉండవచ్చని తెలిపారు. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంపు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
- Advertisement -


