Saturday, April 11, 2026
E-PAPER
Homeజిల్లాలుఅజానుబావుడు జ్యోతి బాపు పూలే

అజానుబావుడు జ్యోతి బాపు పూలే

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా శనివారం చౌటుప్పల్ కోర్ట్ ఆవరణలో ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫూలే సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి, విద్య ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి జీవితాంతం కృషి చేశారని తెలిపారు.మహిళా సాధికారత, విద్యా విస్తరణకు ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అలాగే సమానత్వ సమాజం నిర్మాణం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి రిక్కల సుధాకర్ రెడ్డి మక్తాల నరసింహ,జక్కర్తి శేఖర్,బడుగు శ్రీకాంత్, అన్నమల్ల నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -