నవతెలంగాణ -పరకాల
జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా జెండాకు సెల్యూట్ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరకాల పురపాలక సంఘం కమిషనర్‌పై విచారణ జరిపి, తప్పు తేలితే చర్యలు తీసుకోవాలని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి మేఘనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆగస్టు 15న మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఇప్పటికే పోలీస్‌స్టేషన్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదో ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన అంశంపై తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య, న్యాయపోరాటం చేస్తామని మేఘనాథ్ స్పష్టం చేశారు.
పురపాలక కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



