నవతెలంగాణ-తంగళ్ళపల్లి: పేదల సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యపడుతుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఎప్పటికప్పుడు దశలవారీగా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గం గౌడ్, డైరెక్టర్లు పరుశరాములు,సర్పంచ్ పరుశరాములు, ఉప సర్పంచ్ కొత్త సంతోష్, మండేపల్లి సర్పంచ్ సాగర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



