Saturday, April 11, 2026
E-PAPER
Homeనిజామాబాద్నూర్జహాన్‌కు విప్లవ జోహార్లు

నూర్జహాన్‌కు విప్లవ జోహార్లు

- Advertisement -
  • సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి వి.ప్రభాకర్
    నవతెలంగాణ-ఆర్మూర్:ట్రేడ్ యూనియన్ నాయకురాలు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ నూర్జహాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి వి ప్రభాకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దోపిడి లేని రాజ్య స్థాపన కొరకు కామ్రేడ్ నూర్జహాన్ కలలు కన్నదని,అటవీప్రాంతంలో ఉన్న తన సొంత గ్రామం లో పెత్తందార్ల దౌర్జన్యాలను… అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలను చూసి చలించిపోయి.. నాటి పీపుల్స్ వార్ పార్టీలో చురుకైనకార్యకర్తగా పనిచేస్తూ,సిపిఎం రాజకీయాలను నమ్మి రాష్ట్ర నాయకురాలుగా ఎదిగిందని అన్నారు.

కామ్రేడ్ నూర్జహాన్ స్వతగా చొరవగలిగిన కార్యకర్త అని,అంగన్వాడి.. బీడీ కార్మికుల ను సమీకరించి ఎన్నో పోరాటాలను నిర్వహించిందని,సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమమే పరిష్కారమని నమ్మిన కార్యకర్తగా కామ్రేడ్ నూర్జహాన్ తన ఉద్యమ ప్రస్థానంలో పేరు సాధించుకుందని అన్నారు.వామపక్ష ఉద్యమానికి ఆమె లేని లోటు పూడ్చలేనిదని నేను భావిస్తున్నాను.. కామ్రేడ్ నూర్జాన్ కు విప్లవ జోహార్ లు ప్రకటిస్తున్నాను,వారి కుటుంబానికి బంధుమిత్రులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని,ముఖ్యంగా తన కుమారులు ఇద్దరు, అర్థభాగస్వామి అయిన ఆనంద్ ధైర్యం కోల్పోవద్దని, మీకే కాదు వామపక్ష ఐక్య ఉద్యమాన్ని కూడా లోటేనని ఈ లోటును మనమందరం ధైర్యంగా ఎదుర్కొందామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -