- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న బీఎండబ్ల్యూ కారు టోల్‌గేట్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ కాంక్రీట్ రెడీమిక్సర్ లారీ అదుపుతప్పి కారుపై బోల్తా పడింది. లారీ బరువుకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ప్రయాణికులు లోపలే మరణించినట్లు సమచారం. ప్రస్తుతం జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించి, కారులో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసేందుకు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
- Advertisement -



