Saturday, August 29, 2026
E-PAPER
Homeక్రైమ్పేలిన కారు టైరు..నలుగురు విద్యార్థులు మృతి

పేలిన కారు టైరు..నలుగురు విద్యార్థులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -