నవతెలంగాణ-హైదరాబాద్: పీపుల్స్ పోప్‌గా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫార్రెల్ వాటికన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రకటించారు. దీంతో తదుపరి పోప్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ రేసులో ప్రముఖంగా వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్, ఐరోపా బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో, కార్డినల్ పీటర్ టురుక్సన్ (ఘనా), కార్డినల్ లూయీస్ టాగ్లో, కార్డినల్ మాట్టో జూప్పీ, కార్డినల్ రేమాండ్ లియో బుర్కె పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తదుపరి ప్రోప్ ఎన్నికలకు 2025 జనవరిలోనే రూల్స్ ప్రకటించారు. కేవలం 80 లోపు వయసు ఉన్న కార్డినల్స్ మాత్రమే పోప్ ఎంపిక రహస్య ఓటింగ్‌లో పాల్గొననున్నారు. దీంతో మొత్తం 252 కార్డినల్స్‌లో 138 మందికి మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉంది. దీనికి సంబంధించిన ఓటింగ్ సిస్టీన్ ఛాపెల్‌లో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 నుంచి 20 రోజుల వరకు కొనసాగుతుంది. అదే 10-12 రోజుల వరకు మెజార్టీ నెంబర్‌ను ఎవరూ సాధించలేకపోతే.. ఆ తర్వాత సాధారణ మెజార్టీ వచ్చిన పోప్‌గా వారసుడిగా ఎన్నికవుతారు.
తదుపరి పోప్‌పై ఉత్కంఠ..రేసులో ఐదుగురి పేర్లు?
- Advertisement -
RELATED ARTICLES