Sunday, April 12, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోధా బ్లాక్‌లో జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు, పికప్ వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వ్యాన్‌లోని 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. 30 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -