- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని అఖ్నూర్లో అత్యంత అరుదైన టోర్నడో శనివారం భీభత్సం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ సుడిగాలిని స్థానికులు ఆసక్తిగా చూశారు. ఇది కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించింది. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
- Advertisement -



