- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
- Advertisement -



