నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి దాదాపు 9.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. https://www.tgbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నంబరుకు వాట్సప్‌లో “Hi” పంపండి.. “BIE Exam Result” టైప్ చేసి Open Service నొక్కండి. మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ/2వ) మరియు స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకుని సబ్మిట్ చేస్తే మీ ఫలితం తక్షణమే వస్తుంది.
అమ్మాయిలదే హవా
ఇక బాలికలు 74.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.5 లక్షల మంది హాజరవ్వగా.. ఫస్టియర్‌లో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 3,58,490 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



