- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా శనివారం ఆమెను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈక్రమంలో అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. వెయ్యికి పైగా బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడారు. ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
- Advertisement -



