Sunday, April 12, 2026
E-PAPER
Homeఖమ్మంఇంట‌ర్‌లో ఫ‌లితాల్లో మైనారిటీ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ఘనత

ఇంట‌ర్‌లో ఫ‌లితాల్లో మైనారిటీ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ఘనత

- Advertisement -

నవతెలంగాణ-అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికలు-1) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలను సాధించి కీర్తి ప్రతిష్టలు పొందారు.ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం బయ్‌పీసీ విభాగానికి చెందిన విద్యార్థిని ఎన్. ఉష 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అదే విధంగా ఎంపీసీ విభాగానికి చెందిన విద్యార్థిని ఆర్. అపర్ణ 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించింది.

విద్యార్థినుల ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ సంగీత , అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, కృషి, నాణ్యమైన బోధనతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను అభినందించారు.రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం ద్వారా ఈ కళాశాల మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని అధ్యాపకులు ఆకాంక్షించారు.

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు – 2025 – 26
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికలు – 1
అత్యధిక మార్కులు పొందిన వారు…
రెండో సంవత్సరం బైపీసీ విద్యార్ధిని ని ఎస్.ఉష 992/1000
రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్ధిని ఆర్.అపర్ణ 991/1000
మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్ధిని ఎం.వర్షిత 436/440
మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్ధిని ఎం.సంజన 461/470 మార్కులు సాధించారు.
ఈ కళాశాల లో రెండో సంవత్సరం ఎంపీసీ లో 29 మందికి 29 ఉత్తీర్ణత పొంది 100 శాతం రికార్డు నెలకొల్పారు.
రెండో సంవత్సరం బైపీసీ లో 28 మందికి 27 ఉత్తీర్ణత పొందారు.ఉత్తీర్ణత శాతం (97%)
రెండో సంవత్సరం మొత్తం 57 మంది 56 ఉత్తీర్ణత పొందారు.ఉత్తీర్ణత శాతం (98.2%)

మొదటి సంవత్సరం ఎంపీసీ లో 24 మందికి 22 మంది ఉత్తీర్ణత పొంది, ఉత్తీర్ణత శాతం (91.66%) సాధించారు.
మొదటి సంవత్సరం బైపీసీ లో 42 మందికి 32 ఉత్తీర్ణత పొంది, (76%) ఉత్తీర్ణత శాతం సాధించారు.
మొదటి సంవత్సరం 66 మందికి 54 మంది ఉత్తీర్ణత పొంది (81%) ఉత్తీర్ణత శాతం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -