నవతెలంగాణ-కుభీర్: మండల కేంద్రమైన కుభీర్ కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఆదివారం ఇంటర్నెట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కళాశాల టాపర్గా కంప్యూటర్ సైన్స్ విభాగంలో జాదవ్ నందిని టాపర్గా నిలించింది. 500 మార్కులుగాను 484 సాధించింది. ద్వితీయ స్థానంలో జే పూర్ణిమ 468 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం కుబీర్ కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్య విభాగం ఏర్పాటు చేయడంతో మొత్తం 27 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా ఇందులో 26 ఉత్తీర్ణత సాధించి 96% సాధించారని కళాశాల ప్రిన్సిపల్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మొదటి సంవత్సరంలో విద్యార్థులు తక్కువగా తక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది దీంతో వచ్చేయడాది విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచి 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తామని సూచించారు. అనంతరం కళాశాల కాపరులకు కళాశాల తరఫునుంచి విద్యార్థులను అభినందించారు.



