నవతెలంగాణ–ఆలేరు రూరల్: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.ఆదివారం ఆలేరు మండలం గోలనుకొండ,కొల్లూరు,మందనపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, తూకం యంత్రాలు, గన్నీ సంచులు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా, తేమ శాతం సరైన స్థాయిలో ఉంచి తీసుకురావాలని సూచించారు. ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, సర్పంచులు జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి,ఇందూరి యాదిరెడ్డి,సిరిమర్తి రేణుక నరసయ్య,ఉప సర్పంచ్ లు బాకీ యాదగిరి,గాజుల దశరథ,,పద్మ శశిరేఖ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



