నవతెలంగాణ – హైదరాబాద్ : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధనతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(twjf) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం మధిర నియోజకవర్గం చేరుకుంది. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండల కేంద్రాల్లో స్థానిక జర్నలిస్టులతో కలిసి ఫెడరేషన్ బృందం పాదయాత్ర నిర్వహించింది. ఖమ్మం జిల్లా ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యక్షులు సాగర్, కోశాధికారి వెంకటేశ్వర్లు, నాయకులు చక్రవర్తి, మధుశ్రీ, రవికిరణ్, రామారావు, యాకేష్, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఫెడరేషన్ పాదయాత్రకు అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల మద్దతు లభించింది. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
TWJF పాదయాత్రకు రాజకీయ పార్టీల మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



