Monday, April 13, 2026
E-PAPER
Homeనల్లగొండతుంగతుర్తి బాలుర గురుకుల కళాశాల్లో 100% ఉత్తీర్ణత

తుంగతుర్తి బాలుర గురుకుల కళాశాల్లో 100% ఉత్తీర్ణత

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి: ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ కు ధీటుగా విజయభేరి మోగించారు.మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.ప్రతి సంవత్సరం మండలంలో ప్రథమ స్థానం సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ తెలిపారు.టెన్త్ ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా ఇతర ఎంట్రెన్స్ టెస్టులలోనూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తున్నారని అన్నారు.ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో యశ్వంత్ 983/1000, ఇంటర్ ప్రథమ సంవత్సరం సాయి చైతన్య 465/470, సాయిరాం 462/470 మార్కులు సాధించినట్లు తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రథమ సంవత్సరం 49%,ద్వితీయ సంవత్సరం 69% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మధుకర్ తెలిపారు.సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల నుండి ప్రథమ సంవత్సరం 78%, ద్వితీయ సంవత్సరం 87% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ సంధ్యారాణి తెలిపారు.గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల నుండి ప్రధమ సంవత్సరం ఎంపీసీ విభాగం నుండి 65%, బైపిసి విభాగం నుండి 67%, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగం నుండి 88%, బైపీసీ విభాగం నుండి 100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -