Monday, April 13, 2026
E-PAPER
Homeనిజామాబాద్కామ్రేడ్ నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు

కామ్రేడ్ నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు

- Advertisement -
  • సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

నవతెలంగాణ-కామారెడ్డి: సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ (43) అనారోగ్యంతో నిజామాబాద్ పట్టణంలోని శనివారం మృతి చెందారు. ఆదివారం తన స్వస్థలం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కార్యక్రమo నిర్వహించారు. నూర్జహాన్ మరణం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. నూర్జహాన్ మృతి పట్ల సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఆదివారం బాన్స్వాడలో జరిగిన అంతిమ యాత్ర కార్యక్రమంలో భాగంగా పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఐటియు యొక్క కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ నూర్జహాన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకురాలు, జిల్లాలో బీడీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయితీ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ తదితర కార్మికుల సమస్యల పరిష్కారానికై పోరాటాలు సమరశీలంగా నడిపిన మిలిటెంట్ నాయకురాలు.

అన్నిరకాల కార్మికులను ఐక్యంగా సంఘటితం చేయడంలో నూర్జహాన్ పాత్ర మరువలేనిది. ఆమె కార్మిక హక్కులు, రక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిపింది. నూర్జహాన్ మరణం నిజామాబాద్ జిల్లా కార్మికవర్గానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. నిజామాబాద్ ట్రేడ్ యూనియన్, ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణంలో కామ్రేడ్ నూర్జహాన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించారని అన్నారు. నూర్జహాన్ చిన్ననాటి నుండే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆకర్షితురాలై అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. తన 8 నెలల పసిబిడ్డతో వరంగల్ సెంట్రల్ జైలులో 18 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపింది. పేదలకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు కావాలని చేసిన భూ పోరాటంలో కూడా పోలీసుల కేసులు, నిర్భంధాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసింది. కడదాకా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటు పడింది. కార్మికవర్గానికి, ప్రజా ఉద్యమాలకు ఆమె లేని లోటు తీరనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, మోతి రామ్ నాయక్, అరుణ్, రేణుక, బాలమణి, దొడ్లమోహన్, రవీందర్, దశరథ్, మంద శ్రీనివాస్, కర్రల సత్యం, మహాదేవి, గౌరీ, పల్లవి, మంగాదేవి, రాజు, కమ్మరి సాయిలు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -