- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఘోరం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె(13)పై తండ్రి తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు. ఇది గమనించిన తల్లి భర్తతో గొడవపడి ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -



