నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. బీరుట్ లోని పలు కీలక ప్రాంతాలపై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో అనేక మంది మృతి చెందారు. ఈక్రమంలోనే హిజ్బుల్లా ఇజ్రాయిల్‌కు చెందిన 43 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ వైమానిక దాడులకు ప్రతికార దాడులు చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
ఈ దాడులు సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరాలలు, అలాగే ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్, ఉత్తర ఇజ్రాయెల్‌తో సహా ఆక్రమిత భూభాగాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. గోలన్ హైట్స్‌లోని అల్-అలికా బ్యారక్స్‌లో ఉన్న కమ్యూనికేషన్ల కేంద్రంపై డ్రోన్ దాడి కూడా ఉంది, ఇది “నేరుగా లక్ష్యాన్ని ఛేదించిందని” వారు పేర్కొన్నారు. లెబనాన్‌లోని మైస్ అల్-జబల్‌లో ఒక ఆసుపత్రి సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ మెర్కావా ట్యాంక్‌పై డ్రోన్ దాడి చేసినట్లు ప్రకటించింది.



