Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బాని హరికృష్ణ, డీసీసీ జనరల్ సెక్రటరీ నిమ్మ విజయకుమార్, జూలూరి సుధాకర్, తాటి ప్రసాద్, కామారెడ్డి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సలీం, చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్, ఇమ్రోజ్, పండు శ్రీకాంత్, నిరంజన్, మున్ను, శశి, రాహుల్, ఖాన్, చంద్రశేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -