Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ పీఎస్ లో పీస్ కమిటీ సమావేశం..

జుక్కల్ పీఎస్ లో పీస్ కమిటీ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్సై భువనేశ్వర్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ పురస్కరించుకొని వివిధ మత పెద్దలు, యువకుల సమక్షంలో  పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరులు నిర్వహించుకునె బక్రీద్ పండుగకు, కులమతాలకు అతీతంగా అందరూ శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. అదేవిధంగా గోవులను వధించరాదని, వాటి సంరక్షణ బాధ్యతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉందని తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామాలలో మత విద్వేషాలు తావివ్వకుండా శాంతి కమిటీలు  ఏర్పాటు చేసుకొని కలిసిమెలిసి అన్నదమ్ములుగా పండుగలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై తో పాటు ఎస్ఐ వెంకట్రావు , పోలీసు సిబ్బంది , వివిధ మతాలకు చెందిన మత పెద్దలు , యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad