‘కెేజీఎఫ్, సలార్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. రీసెంట్‌గా ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. అయితే ఈ క్రేజీ మూవీ సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. నేటి (మంగళవారం) నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీని కోసం ఆయన హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళుతున్నారు. రోజు రోజుకీ ఈ కాంబోపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ చిత్రీకరణలో పాల్గొనబోతుండటంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ యూనిక్ మాస్ విజన్‌తో ఎన్టీఆర్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : భువన్ గౌడ, సంగీతం : రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైనర్ : చలపతి
‘డ్రాగన్’గా ఎన్టీఆర్?
- Advertisement -
RELATED ARTICLES