Friday, April 24, 2026
E-PAPER
Homeక్రైమ్చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు

చెల్లి ప్రియుడిని కొట్టి చంపిన అన్నలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ :గుజరాత్‌లోని రాజులాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ముగ్గురు సోదరులు కలిసి ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. తమ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దినేష్‌కు, నిందితుల సోదరి సోనాల్‌కు మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ సమయంలో దినేష్ ఆమెను మొర్బీకి తీసుకెళ్లాడు. అయితే, రెండు నెలల తర్వాత సోనాల్ తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దినేష్‌ను చంపేస్తామని నిందితులు గతంలో బెదిరించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న దినేష్, వ్యవసాయ కూలీలతో కలిసి మొర్బీ నుంచి వచ్చి తన స్నేహితుడి పొలానికి వెళ్లాడు.

రాత్రి 8:30 గంటల సమయంలో పొలంలో స్నేహితుడితో కూర్చుని ఉండగా, సోనాల్ సోదరులైన రాజేష్, సుర్‌సింగ్, కేవల్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. దినేష్‌ను కాస్త దూరంగా తీసుకెళ్లి, ‘మా చెల్లిని తీసుకెళ్లి మా పరువు తీశావు’ అంటూ వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత అతడిపై దాడికి దిగారు. రాజేష్ తన బెల్టు తీసి కొట్టగా, సుర్‌సింగ్ తాడుతో తలపై దాడి చేశాడు. కేవల్ కూడా బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. దాదాపు రెండు గంటల పాటు ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు బెల్టులు, తాళ్లతో దినేష్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన దినేష్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -