Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకమల్‌ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా

కమల్‌ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నటుడు కమల్‌ హాసన్‌ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కన్నడ భాషపై చెలరేగిన వివాదం వేళ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇవాళ రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తన రాబోయే చిత్రం థగ్‌ లైఫ్‌ విడుదలయ్యే వరకూ నామినేషన్‌ దాఖలును వాయిదా వేయాలని సన్నిహితులు కమల్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి సూచనల మేరకు ఇవాళ వేయాల్సిన నామినేషన్‌ను వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి.

కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది. జూన్‌ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్‌ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img