– అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ప్రధాని మోడీ భేటీ
– పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు
– అక్షరధామ్‌ను సందర్శించిన వాన్స్ కుటుంబం
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ తన కుటుంబంతో కలిసి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం దేశ రాజధాని చేరుకున్న వాన్స్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. అనంతరం వాన్స్, ప్రధాని మోడీతో ఆయన నివాసంలో ద్వైపాక్షిక భేటీ జరిపారు. తన నివాసానికి వచ్చిన వాన్స్ కుటుంబ సభ్యులకు ఎదురేగి మోడీ వారిని సాదరంగా లోపలకు ఆహ్వానించారు. భారత సాంప్రదాయ దుస్తులను ధరించిన వాన్స్ పిల్లలతో మోడీ ముచ్చట్లాడారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల బృందాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పంద అంశాలపై చర్చించారు. అలాగే ఇంధన, రక్షణ రంగాల్లో సహకారంపై, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు. వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై, పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు అభినందనలు తెలియచేస్తూ మోడీ, ఈ ఏడాది చివరిలోగా ట్రంప్ భారత్‌లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై భారత్ ఆందోళనలను కూడా ఈ సందర్భంగా మోడీ తెలియచేశారని భావిస్తున్నారు. చర్చల అనంతరం వాన్స్ కుటుంబానికి ప్రధాని మోడీ ఆతిథ్యం ఇచ్చారు. వాన్స్‌తో పాటు వచ్చిన అమెరికా ప్రతినిధి బృందం కూడా ఈ ఆతిథ్యంలో పాల్గొంది.అంతకుముందు వాన్స్ కుటుంబం ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షరధామ్‌ను సందర్శించింది. అక్కడ లభించిన ఆతిథ్యాన్ని, అబ్బురపరిచిన ఆలయ నిర్మాణ శైలిని, కట్టడాన్ని ప్రశంసిస్తూ వాన్స్, ఆలయ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. నాలుగు రోజుల పాటు సాగే వాన్స్ పర్యటనలో దౌత్యపరమైన కార్యకలాపాలతో పాటూ ఇటు సాంస్కృతిక పరమైన అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు.
వాణిజ్య ఒప్పందమే కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES