నవతెలంగాణ – దుబ్బాక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “భూ భారతి ఆర్ఓఆర్- 2025 చట్టం” రెవిన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. గురువారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో భాగంగా పలువురి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్ మాట్లాడుతూ, భూ సమస్యలు తీర్చేందుకే కాంగ్రెస్ సర్కార్ ‘ భూ భారతి ఆర్ఓఆర్ – 2025’ చట్టం తెచ్చిందని, ఇది అన్నదాతల పాలిట చుట్టమని పేర్కొన్నారు. ఈ సదస్సులో రెవెన్యూ సిబ్బంది కూడవల్లి ఆలయ డైరెక్టర్ వేల్పుల యాదగిరి ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపరి రమేష్, బోడోల్ల దేవరాజ్ వేల్పుల నర్సింలు, గోపరి స్వామి, గొడుగుపల్లి బిక్షపతి, గోపరి యాదగిరి పలువురు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్
- Advertisement -
- Advertisement -



