Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్యకర్త కుటుంబానికి అండగా కేటీఆర్‌

కార్యకర్త కుటుంబానికి అండగా కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజకర్గంలోని హేమ్లానాయక్‌ తండాకు చెందిన విస్లావత్‌ బాబ్య బతకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్ళారనీ, గత నెల 27న తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారని కుటుంబ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌదీలో ఉండే కఠిన నిబంధనలతో మృతదేహాన్ని సొంతూరుకు రప్పించడంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు తెలియచేయడంతో ఆయన కృషితో విస్లావత్‌ బాబ్య మృతదేహం రాత్రి స్వగ్రామానికి చేరడంతో గురువారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ మేరకు కేటీఆర్‌, అంజయ్య యాదవ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -