నవతెలంగాణ-హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా, 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
- Advertisement -
RELATED ARTICLES