– ఎనిమిదేండ్లలో మూడోసారి
– క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల (ఏప్రిల్ 22-23) పర్యటనలో భాగంగా మోడీ మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి చేరుకున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన మొహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లారు. కాగా, ప్రధాని మోడీ 2016, 2019లో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ఇది మూడోసారి ఆయన పర్యటన. అయితే మోడీకి ముందు ఉన్న భారత ప్రధానులందరూ గడచిన ఏడు దశాబ్దాల్లో మూడుసార్లు పర్యటన చేస్తే.. ఒక్క మోడీ మాత్రమే గడచిన ఎనిమిదేండ్లలో మూడుసార్లు పర్యటన చేశారు.
సౌదీ అరేబియాలో ప్రధాని మోడీ
- Advertisement -