నవతెలంగాణ – హైదరాబాద్; కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా హరీష్ రావు ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, క్యాబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోనూ, తెలంగాణలోనూ, సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. దాంతో తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావాడం కోసం ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్‌కు తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన వివరాలు
- కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా
 - కేవలం నోటి మాటలే కాదు.. రాత పూర్వకంగా వివరాలుఅందించాను
 - ఆధారాలతో సహా కమిషన్ ముందు పెట్టాం
 - తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని అడిగారు
 - తమ్మడిహెట్టి దగ్గరే కట్టాలని అనుకున్నాం.. కానీ
 - మహారాష్ట్ర అభ్యంతరాల వలన మార్చాల్సి వచ్చింది ..
 - తమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టును ఒప్పుకోమని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది
 - ప్రాజెక్టు గురించి మహారాష్ట్రతో 5, 6 సార్లు సమావేశాలు జరిగాయి
 - మీటింగ్ సారాంశాన్ని కమిషన్ కు వివరించాం
 - 2014 కు ముందు ఈ ప్రాజెక్టును ఇష్టారాజ్యంగా రూపకల్పన చేశారు
 - తమ్మిడిహెట్టి దగ్గర పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో తవ్వారు
 - నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చాం
 - కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శిస్తున్నారు
 - కానీ.. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైమ్ లైట్.. జీవధార
 - గత ప్రభుత్వం 7 ఏండ్లలో పర్మిషన్ కూడా తీసుకురాలేకపోయింది
 - కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు.. ఉందని వివరాలు ఇచ్చాం
 - అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి అడిగారు..
 - టెక్నికల్ ప్రాబ్లం.. ఇంజినీర్లు తీసుకునే నిర్ణయమని చెప్పాం.
 - గతంలో ఎన్నో ప్రాజెక్టులు డిజైన్లు మారాయి..
 - నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా డిజైన్లు మారాయి..
 - ఇది కూడా టెక్నికల్ ప్రాబ్లంతో మార్చామని చెప్పాం.
 - రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత అని అడిగారు
 - 141 టీఎంసీలు అని చెప్పాం
 - కాళేశ్వరంలో వంద భాగాలున్నాయి..
 - సీఎం రేవంత్ గంధమళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు
 - గంధమళ్ల కు నీళ్లు కాళేశ్వరం నుంచే వస్తాయి
 - మూసీ సుందరీకరణకు నీళ్లు కాళేశ్వరం రావాలి
 - మరోవైపు కాళేశ్వరం కూలిందని చెబుతారు
 - రేపు (మంగళవారం, జూన్ 10) తెలంగాణ భవన్ లో మిగతా ప్రశ్నలకు సమాధానం చెబుతాం..
 

                                    

