Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకర్ణాటక హైకోర్టులో ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు భారీ ఊరట

కర్ణాటక హైకోర్టులో ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు భారీ ఊరట

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఆర్సీబీ ఐపీఎల్‌ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించి, 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

కాగా కర్ణాటక హైకోర్టు స్వయంగా స్వీకరించిన సుమోటో కేసుపై కూడా రేపే విచారణ జరుగనుంది. ఆర్సీబీ, డీఎన్‌ఎ ఈవెంట్‌ నిర్వహణలో నిర్లక్ష్యం, పోలీసుల అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో ఉచిత పాస్‌లు ప్రకటించడం వల్ల గందరగోళం, తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తు, రిటైర్డ్‌ జస్టిస్‌ జాన్‌ మైఖేల్‌ డి’కున్హా నేతృత్వంలో కమిషన్‌, మెజిస్ట్రేట్‌ విచారణను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img