Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం'జాతీయవాదం పెరగడం ప్రమాదం'

‘జాతీయవాదం పెరగడం ప్రమాదం’

- Advertisement -

పోప్‌లియో
వాషింగ్టన్‌:
ఏ నాయకుడి పేరు పెట్టకుండా ”వివిధ దేశాల్లో జాతీయవాద రాజకీయాలు పెచ్చరిల్లడం దురదృష్టకర పరిణామమని పోప్‌లియో ఆదివారం వాటికన్‌ సిటీలో జరిగిన ప్రార్థనల సందర్భంగా విమర్శించారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొదటి వ్యక్తి పోప్‌లియో. సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో (పోప్‌ కాక ముందు) ట్రంప్‌ విధానాలను నేరుగా విమర్శించిన పోప్‌ ఇప్పుడు పేర్లు పెట్టకుండానే నర్మగర్భంగా సరిహద్దులను మూసివేయడం ‘గోడలు’ బద్దలు కొట్టడం, ద్వేషాన్ని విరజిమ్మకపోవడం క్రిష్టియానిటీలో కీలక విషయాలన్నారు. గత పోప్‌ ఫ్రాన్సిస్‌ ట్రంప్‌ విధానాలను గట్టిగా విమర్శించేవారు. ఈ ఏడాది జనవరిలో వేలాది వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టడం మానవత్వం కాదని, అవమానకరమైన ఈ చర్యను నిలిపివేయాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయనెవరైనప్పటికీ మనుషుల్లో అనుసంధానించు కోగలడా? అడ్డు గోడలు నిర్మించాలని చూసే వారు క్రిష్టియనే కాదని ఘాటుగా ట్రంప్‌నుద్దేశించి ఆయన మాట్లాడటం కీలకాంశమని పరిశీలకులంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad