నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు-2025 మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు. పదో తరగతి, ఒపెన్ స్కూల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా… పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
- Advertisement -