నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం పహల్గామ్‌లో అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఉగ్రదాడిపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన దారుణ దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని, ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను” అని కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్ అయింది. లక్షలాది మంది అభిమానులు, నెటిజన్లు స్పందించారు.
పహల్గామ్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది: విరాట్ కోహ్లీ
- Advertisement -
RELATED ARTICLES