Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్టు విడుద‌ల‌..ఇండియా స్థాన‌మెంతంటే..?

గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్టు విడుద‌ల‌..ఇండియా స్థాన‌మెంతంటే..?

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ .. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ (Global Gender Gap Index) 2025 రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ 146 దేశాల్లో 131వ స్థానంలో నిలిచింది. కాగా గత సంవత్సరంతో పోలిస్తే భారత్ రెండు స్థానాలు కోల్పోయింది. ఈ నివేదికలో భారతదేశం యొక్క జెండర్ పారిటీ (Gender Parity) స్కోరు 64.1%గా ఉంది. ఇది దక్షిణాసియాలో అత్యల్ప స్కోర్‌లలో ఒకటిగా నమోదైంది. భారతదేశం 2024లో 129వ స్థానంలో ఉండగా.. 2025లో 131వ స్థానానికి పడిపోయింది. దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్ (24వ ర్యాంక్), భూటాన్ (119), నేపాల్ (125), శ్రీలంక (130) భారతదేశం కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మాల్దీవులు, పాకిస్తాన్ మాత్రమే భారతదేశం కంటే వెనుకబడి ఉన్నాయి.

తాజా నివేదిక ప్ర‌కారం విద్యలో జెండర్ గ్యాప్ గణనీయంగా తగ్గింది.ఆరోగ్యం, జీవన రంగంలో కూడా స్వల్ప మెరుగుదల కనిపించింది. అలాగే రాజకీయ సాధికారతలో భారతదేశం గణనీయంగా వెనుకబడినట్లు తాజా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. భారత పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం 14.7% నుండి 13.8%కి తగ్గింది. మంత్రి స్థానాల్లో మహిళల భాగస్వామ్యం 6.5% నుండి 5.6%కి పడిపోయింది. అయితే దక్షిణాసియా ప్రాంతం మొత్తంగా జెండర్ పారిటీలో పురోగతి సాధించినప్పటికీ, భారతదేశం యొక్క పనితీరు ఆందోళనకరంగా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad