Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅహ్మదాబాద్‌ దుర్ఘటన కలచివేసింది: రాహుల్ గాంధీ

అహ్మదాబాద్‌ దుర్ఘటన కలచివేసింది: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. “ఈ ప్రమాదం హృదయవిదారకమైనది. ప్రయాణికులు, విమాన సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహకు అందనివి. ఈ అత్యంత క్లిష్ట సమయంలో వారందరికీ నా ఆలోచనలు తోడుగా ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి, సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టడం అత్యంత కీలకమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. “ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనది. కాబట్టి, అత్యవసర సహాయక చర్యలు వెంటనే అందాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో ఉండి, బాధితులకు తమకు సాధ్యమైనంత సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 133 మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad