Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅద్దె భవనాల్లో గురుకులాలు కధనానికి స్పందన..

అద్దె భవనాల్లో గురుకులాలు కధనానికి స్పందన..

- Advertisement -
  • – పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే..
    – మురికి నివారణకు చర్యలు చేపట్టాలి..
    – భవనం యజమానికి ఆదేశం..
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • “అద్దె భవనాల్లో గురుకులాలు” అనే శీర్షికన నవతెలంగాణ లో గురువారం ప్రచురితం అయిన కధనానికి స్పందన లభించింది. పాఠశాలల పునఃప్రారంభం పురస్కరించుకుని గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట లో పాల్గొనడానికి అశ్వారావుపేట వచ్చిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలను.ఈ పాఠశాల పక్కనే ఉన్న భారీ మురికి గుంట ను పరిశీలించారు.భవనం యజమాని మద్దు సత్యనారాయణ తో మాట్లాడారు.పాఠశాల తిరిగి ప్రారంభం అయినందున విద్యార్ధిని లు వస్తున్నారని,పూర్తి స్థాయిలో రాకమునుపే డ్రైనేజీ సమస్యకు పరిష్కారంగా మురికి కాలువ నిర్మాణం చేపడతామని,అందుకోసం నిధులు కేటాయించామని యజమానికి తెలిపారు.మురికి నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి విద్యార్ధులు జ్వరాలు బారిన పడే అవకాశం ఉందని కావున యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని జూపల్లి రమేష్ కు సూచించారు.
    • ఆయన వెంట ప్రిన్సిపాల్ నిరోషా, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ లు, స్థానిక నాయకులు తుమ్మ రాంబాబు, ప్రమోద్, మిండ హరిక్రిష్ణలు ఉన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad