Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవిమాన ప్రమాదం.. బాధితులకు అండగా ఉంటాం: అంబానీ

విమాన ప్రమాదం.. బాధితులకు అండగా ఉంటాం: అంబానీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్‌లో నిన్న‌ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన తీవ్ర ప్రాణ నష్టం నన్ను, నీతను, మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ విషాద ఘటనలో నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాము” అని అంబానీ తన ప్రకటనలో తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలుస్తామని, కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. “ఈ దుఃఖ సమయంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు రిలయన్స్ తన పూర్తి, అచంచలమైన మద్దతును అందిస్తుంది. సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఊహించని నష్టాన్ని తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని బాధితులందరికీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము” అని అంబానీ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad