Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్..

కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్..

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : డీసీసీ అధ్యక్షులతో, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుంది. రాహుల్ గాంధీ సమాజంలో ఎవరి వాటా వారికి ఇవ్వాలన్న సిద్ధాంతంతో పని చేస్తున్నారు. వారి సిద్ధాంతాలను మనం అమలు చేస్తున్నాం..
ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని పదవులలో సామాజిక న్యాయాన్ని పాటించాము. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు వస్తాయి. అంతేకాని పదవులకోసం పార్టీ నేతలు పాకులాడవద్దని రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణ లో పెద్దఎత్తున నిర్వహించాము. మనమే అన్ని రాష్ట్రాల కంటే బాగా చేసాము. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణ ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం మనకు గర్వకారణం అన్నారు. సంస్థాగత నిర్మాణం కూడా మన రాష్ట్రంలోనే బాగా జరుగుతుంది. రాష్ట్ర పరిశీలకులు, కో ఆర్డినేటర్లు బాగా పని చేస్తున్నారు. మండల జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పకడ్బందీగా చేయాలి పార్టీ లో చిత్తశుద్ధితో పని చేసిన వారికి అందరిని పార్టీ వారి వారి స్థాయిలలో తప్పకుండా గుర్తిస్తుందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad