Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రశాంతంగా ముగిసిన బార్ల డ్రా

ప్రశాంతంగా ముగిసిన బార్ల డ్రా

- Advertisement -

– కమిషనర్‌ సి. హరి కిరణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బార్ల డ్రా ప్రశాంతంగా ముగిసింది. లబ్ధిదారులను కమిషనర్‌ సి.హరి కిరణ్‌ స్వయంగా కలిశారు. 28 బార్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శంగా జరిగినట్టు ఆయన వెల్లడించారు. బార్ల దరఖాస్తు దారుల సమక్షంలో ప్రశాంతంగా డ్రా ప్రక్రియ ముగిసిందనీ, ఈ కార్యక్రమానికి సహకరించిన దరఖాస్తుదారులకు, ఎక్సైజ్‌ అధికారులందరికీ ధన్యవాదాలు, డ్రాలో గెలుపొందిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ, నార్సింగ్‌ ప్రాంతంలో ది అడ్రస్‌ కన్వెన్షన్స్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ హాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,525 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలో కమిషనర్‌ డ్రా తీశారు. డ్రా బాక్స్‌ లోని కమిషనర్‌ కాయిన్స్‌ తీసి ఇవ్వగా జాయింట్‌ కమిషనర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కే.ఏ.బి.శాస్త్రి నెంబర్‌ దరఖాస్తుదారుల సమక్షంలో వెల్లడించారు. డ్రాలో బార్‌ షాప్‌ గెలుపొందిన లబ్ధిదారులు లబ్ధిదారులు అలాట్మెంట్‌ లెటర్‌ ని తీసుకొని వెళ్లాలని కమిషనర్‌ ప్రతి ఒక్కరిని కలిసి చెప్పారు. 90 రోజుల్లోగా బార్ల ప్రక్రియను పూర్తి చేసుకుని నడిపించుకోవాల్సిందిగా కోరారు. నిజామాబాద్‌ మహబూబ్‌నగర్‌ జాల్‌పల్లి ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ముగిసిందని కమీషనర్‌ వెల్లడించారు. డ్రాకు ముందు అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరణించిచన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img