న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యతో పంజాబ్‌లో వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన అటాక్ అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రం నుంచి బయల్దేరిన హెలికాప్టర్ నంగాల్‌పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక సమస్యకు సంబంధించి సమాచారం అందడంతో.. ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు అధికారులు, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అత్యవసర ల్యాండింగ్ గురించి ఐఏఎఫ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతికూల వాతావరణంతో ఏప్రిల్‌లోనూ జామ్‌నగర్‌లోని చెంగా గ్రామంలో ఐఏఎఫ్‌కి చెందిన ఒక హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది.